కోరి రాస్తున్నా...
కోరి రాస్తున్నా...


ప౹౹
కోరి రాస్తున్నానూ ఓ కోమలి మెచ్చేందుకు
మరిమరీ ఆ మనసుకు చాలా నచ్చేందుకు ౹2౹
చ౹౹
ఉత్తరంగా రాస్తున్నా ఊహలు పంచేందుకు
చిత్తరువుగా తీర్చిదిద్దనా తీరే పెంచేందుకు ౹2౹
ఉత్తరమంటే వట్టి ఊసులేనా తొలగించను
చిత్రమైన చిరుదీపమే మదిలో వెలిగించను ౹ప౹
చ౹౹
అక్షరాలనే ఆకురాయిగా మలచుకొనీ మరీ
చక్షువులనే చకోరములా పిలుచుకొని కోరీ ౹2౹
అందమైన భావాలూ అధరాలతో సరిపోల్చ
సుందరమైన వలపు సునామి ఎదనే రగల్చ ౹ప౹
చ౹౹
చిన్నకోరికా చింతనిప్పల్లే ఎడదనే వేధించగ
ఉన్నమాట చెప్పి ఉత్తరమేగా ఆస్వాదించగ ౹2౹
అందుకే...
చెక్కిచెక్కి రాస్తున్నాలే భావాలనూ శిల్పంలా
చెక్కిలిని ఆ అధరాన్నిచేసి పలకాబలపంలా ౹ప౹