The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Ramesh Babu Babu

Romance

4.8  

Ramesh Babu Babu

Romance

మౌనం

మౌనం

1 min
393


ప౹౹

ఏమిటో ఆ మౌనం ఎదలో ఏదో ధ్యానం

కనుగొననా కనిపించని కలల ఉద్యానం|2|

చ||

సఖుడే మనసులో నిలచి ఆ ఎద గిల్లగా

తీయని సుఖమేదో తనువునంత అల్లగా|2|

మెత్తని చూపులతో మెరిసినే ఆ కళ్ళతో

కొత్త పరవశం మెలికలై వింత పోకళ్ళతో|ప|

చ||

మరువని ఎరుక మరులే నింపే మదిలో

తరుగని తమకం తనువు పెంచే ఆదిలో|2|

గురికాడే చెలికాడై చేరినే ఆశగ చెంతనే

సరిజోడే సరసంతో తీర్చినే ఆ చింతనే |ప|

చ||

వలపు వాహనమెక్కిన తీరులే ముచ్చట

తలపు తావరమై చేరులే మెల్లగ అచ్చట|2|

వీడి మౌనం చేరుకో ప్రేమ వాకిలి దరిని

వేడిన ఆ ఎలమి ఒకటిగా చేర్చు ఇద్దరినీ|ప|


Rate this content
Log in

More telugu poem from Ramesh Babu Babu

Similar telugu poem from Romance