లేఖా వ్యసనం
లేఖా వ్యసనం
ప౹౹
రాస్తున్నా ఈ లేఖనూ ఎంతో సహనంతో
పంపిస్తున్నాలే నీ కోసం అదే వ్యసనంతో ౹2౹
చ౹౹
ఎన్నిసార్లు రాశానో ఏమరక చెప్పగలవా
అన్నిసార్లూ మౌనానికి అర్థం విప్పగలవా ౹2౹
బదులిచ్చేందుకు బ్రతిమాలించుకోవాలా
బడలిక వదిలించను ఏమైనిచ్చుకోవాలా ౹ప౹
చ౹౹
మళ్ళీరాస్తున్నాలే మనసు సరిచేసుకోను
తుళ్ళిపడే ఆలోచనలే నినే పెనవేసుకోను ౹2౹
కోరికనేమో మరలా కొత్తగానూ చెప్పలేను
ఊరికే రాసేసి మదినీ నేనూ ఒప్పించలేను ౹ప౹
చ౹౹
కనుచూపుమేరలోనైన కనిపించి పోరాదా
మునుమాపువేళకైన మురిపించ రారాదా ౹2౹
నా కళ్ళ ముందే కనువిందు చేసేయరావా
లేఖా వ్యసనాన్ని ముగింపే పలికించరావా ౹ప|