అంతం నుండి ఆరంభం
అంతం నుండి ఆరంభం


ఎంతో వింతైనది ఈ ప్రకృతి రహస్యం,
అంతం అనంతరం ఆరంభం చేశేను లాస్యం |౧|
శ్రీకృష్ణులు వర్ణించారు భగవద్గీత యథార్థం,
వినాశ గర్భంలో దాగిఉన్నది నిర్మాణం పరమార్థం |౨|
ఆత్మ ఎప్పడూ ఉండెను అనంతం,
పాత శరీర త్యాగం అనంతరం వెతికేను నూతన కాయం ||
అగ్నిపర్వతం వలన అయ్యెను విధ్వంసం,
కొంత కాలం తరువాత మొదలయ్యెను కొత్త నిర్మాణ అంశం |౪|
వృక్ష ఫలంలో నిలిచి ఉండెను బీజం,
బీజం నుండి జీవించెను కొత్త జీవం |౫|
భూదేవి నిలయంలో అయ్యెను ఎన్నో నాశనములు,
అందులోంచి పునః జన్మించెను నూతన జీవితములు |౬|