ఎన్నికల రణరంగం
ఎన్నికల రణరంగం


ఎన్నికల మహాసాగరంలో ఎన్నో ఎన్నెన్నో అలలు,
నాయకులు చూపుతారు అగణిత వింత వింత కలలు,
ప్రచురిస్తారు ప్రకటిస్తారు ప్రసారిస్తారు అసంఖ్యమైన ప్రకల్పాలు,
ప్రతిజ్ఞలు విన్న ప్రతి కాయంలో జన్మిస్తాయి సరికొత్త ఆశలు,
ఆ ఎన్నికల ప్రభంజన ముగింపు తెచ్చెను అడియాసలు,
ఆశల సముద్రంలో ఉన్న శరీరం తాకెను తీరం !!
తీరంలో నిలిచిన కాయాన్ని చూసి కూడా,
జనాలలో ఇంకా ఒక తీరని ఆశ ఉంటుంది,
మరో మలుపు వస్తుందని,
ఒక సరికొత్త ఐంద్రజాలిక ప్రభుత్వం వస్తుందని,
పనితీరులో మార్పు తెస్తుందని !!
కానీ మారేది నిర్వాచకుల జాబితా మాత్రమే !!
ఎన్నికల హోరు కొంతమందికి ఒక సంరంభం,
కొంతమందికి ఒక నిర్ణీత వ్యాపారం,
కొంతమందికి ఓ ధనార్జన సంబరం,
ఎన్నో ఎన్నెన్నో అలలు చూపెను ఎన్నికలు,
ఈ ఎన్నికల సముద్రంలో తరంగాల క్రమం ఇలాగే ఉంటుంది ,
ఈ ఎన్నికల రణరంగం ఎన్నో వచిత్ర చిత్రాలు చూపిస్తూనే ఉంటుంది !!