STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

బతుకు పాఠం

బతుకు పాఠం

1 min
25

అతుకుల బొంతకు నగిషీల దుప్పటేల?
గతుకుల బతుకుకు అప్పుల కుంపటేల?
సేతిలోని పిండికే రొట్టె నువ్వు సేసుకో
గొప్పకు పోయి ఆనక తిప్పలు దేనికో?
నేల ఇడిసి సామును ఎన్నడూ సేయబోకు 
నీది కాని దేని కోసం నువ్వు పాకులాడకు
మిడిసిపాటు పనికిరాదు సక్కని జీవితాన
కన్ను లొట్ట పోయినాక సూపు సక్కబడేనా?
అతుకుల బొంతకు నగిషీల దుప్పటేల?
గతుకుల బతుకుకు అప్పుల కుంపటేల?
సేతిలోని పిండికే రొట్టె నువ్వు సేసుకో
గొప్పకు పోయి ఆనక తిప్పలు దేనికో?

ఆ దేవుడిచ్చినాడు అందరికీ అవకాశం
కట్టానికి ఏనాడూ అడ్డురాదు ఆ ఆకాశం
నీ తెలివితేటలనే సేసుకొని ఓ ఆయుధం
ఈ బతుకు పోరాటంలో సేరుకో సికరం
అడ్డదారి తొక్కాలని సేసినావా పయత్నం
ఉన్న నీ నీడ కూడ జారిపోతది కచ్చితం
కాలు సేయి ఉన్నోడికి ఏ పనైన సులభం
బుద్ది బలం తోడు సేస్తె బతుకయ్యే స్వరగం
అతుకుల బొంతకు నగిషీల దుప్పటేల?
గతుకుల బతుకుకు అప్పుల కుంపటేల?
సేతిలోని పిండికే రొట్టె నువ్వు సేసుకో
గొప్పకు పోయి ఆనక తిప్పలు దేనికో?
సిన్న సీమ సూడు అలసిపోక సాగుతాది
అందనంత ఎత్తులకే గువ్వపిల్ల ఎగురుతాది 
సెరువు బరువు తోస్తూనే ఆ సేప ఈదుతాది
మొలకలెత్తే ఇత్తనం భూమి సీల్చి సెట్టవుతాది  
కళ్ళ ముందు కనపడేను ఎన్నెన్నో సాచ్చ్యాలు
రెండు కాళ్ల మనిసికి ఇంకా ఏల ఈ నిరాశలు
నా రాత ఇంతే అని నువు కూలబడకు ఊరికే
నీ రాత తిరగ రాస్తూ ఎగబడి నువు ఉరికెయ్
అతుకుల బొంతను దూది పరుపు సేసుకో
గతుకుల బతుకును సాఫీగా నువు మార్సుకో
సేతిలోని పిండిని నువు కట్టపడి కూడబెట్టుకో 
తిప్పలు లేని గొప్ప బతుకును నిరిమించుకో...


Rate this content
Log in

Similar telugu poem from Classics