ఆశలే ఊపిరి
ఆశలే ఊపిరి
నీ పరిచయమైయ్యాక
నా కనులకు కలలు ప్రాణమయ్యాయి
కలలన్నీ కవితలై పొంగి ప్రవాహమై
సజీవ శిల్పాలయ్యాయి
అందమైన ఊహలకు రెక్కలొచ్చి
ఎగిరే విహంగాలయ్యాయి
ఆకాశంలో తళుకులీనే తారలు
కూడా రేరాజుకై ఎదురుచూస్తూన్నాయి
జాబిలి రానే వచ్చింది కలువ కోసమై
కలువ వేయి కనులతో ఎదురేచూస్తూ
విరిసింది దరహాసమై
జాబిలి మబ్బుల ఒడిలో
ప్రయాణం చేస్తూ వెన్నెలను
వెదజల్లుతూ అలసి
సొలసి సేదతీరి వెళ్ళపోయెనే
రేపటి రోజుకు మరింత ఉత్సాహంతో
రావాలనే ఆశలు ఉప్పొంగిపోయి
ఆశల తోరణాలు గూడు కట్టుకున్నాయి
ఆశలే ఊపిరి !!!ఆశలే శ్వాస నిశ్వాసలు!!!!
