మౌనరాగం
మౌనరాగం
ఝాము రాతిరి జాబిలమ్మ
పారవస్యాల వెన్నెల గానం
మురిసిపోతున్న ప్రక్రుతి
లీనమై, లయమై ,
ఆ వెన్నెల జల్లులో
కరిగిపోతూ...
మనోహర తాదాత్మ్యం
సదా మధురాను బంధాలు
ఉనికి, స్ఫూర్తిల తోనే లయం
భాష తో లేదు ...అవసరం
మౌన రాగంలో తొణికే
ఆ చిన్మయ చైతన్యం
మది మీటే మోహన తారకం..
అదో అనిర్వచనీయ అపురూపం
అనుభవంలోనే అవగతం..
