తీరం చేరని కలలు
తీరం చేరని కలలు
నిదురమరచిన సమయాన నా ఆలోచనల క్రీనీడలు
నిశ్శబ్ద స్వరమై మిమ్మల్ని అనుసరిస్తుంటాయి..
నింగిన చంద్రుడు అలసి మబ్బులచాటున దాగిన సమయాన
నా మానసం మాత్రం మీ వెలుగులో ప్రకాశిస్తూ ఉంటుంది....
అందరూ ఉన్న ఏకాంతన మిము తలచిన క్షణాన
కనిపించని మీ స్పర్శ మనసును తాకే హాయవుతుంటుంది..
మబ్బుల్లా కమ్ముకునే సమస్యల నడుమ
ఊరటనిచ్చే మీ చిరునవ్వు నా తోడు అవుతుంది....
అలుపెరగని సమయం క్షణాలను లెక్కబెడుతుంటే
నా ఊహలు మాత్రం మీతో పరిగెడుతుంటాయి..
నిశీధంటి మీ రూపం నన్ను నాలో కరిగిస్తూనే ఆ
ఖాళీని నింపలేక గుండె సడిలో కలిసిపోతుంటుంది....
ఎక్కడ ఉన్నా నాలో వినపడే మీ అలల స్వరం
ఈ జీవితం విలువ చెబుతూనే ఉంటుంది..
ఆత్మకి అర్థమయ్యే నిగూఢ పరమార్ధంలో మెల్లగా
“Ó ceart go leor" అంటూ ధైర్యాన్నిస్తుంటారు....
