చేజారిన స్వప్నం
చేజారిన స్వప్నం
సందెపొద్దు వాలేక
సూరీడు పడమటికి చేరాక
నిండు జాబిలమ్మ నింగిలో
ఆకాశమంతా పుచ్చవెన్నెల్లలే అవరించాకా
తారలన్నీ తెల్లని మల్లెల్లా మెరిసిపోతుంటే
సరిగ్గా నా మనసేమో యవరాజుతో
జతగూడి ఎన్నెన్నో ఆంక్షల తీరాలు
దాటి అలా ప్రవహిస్తునే వుంది
మూసివున్న కన్నుల్లో కదలాడే స్వప్నాలు
అనంత భావాలకు నిలయాలు ;
కాలం కనుగొనలేని కమనీయ దృశ్యాలు,
పరిమళ భరిత పూదోటలో మెరిసే హరివిల్లులు:
అలా ఆనంద నందన విహారాలతో
తేలాడుతున్న తరుణంలో కన్నీళ్లకు
నీళ్ళు వదిలేస్తూ,పండు వెన్నెల స్థానంలో
వేడి శెగల ృసూరీడు రానే వచ్చాడు
చిటెకలో చేజారిన స్వప్నం-
మాయ కమ్మేసిన ప్రపంచంలోకి
బ్రతుకు వేటలో ,బాధ్యతల
బరువుల్లో నేను;నిన్నటి కలలకు
గురుతులుగా జీవనచక్రం ఎప్పటిలా
ఏమీ తెలియని నంగనాచిలా
అలా అలా సాగిపోతుంది
