ప్రేమకు
ప్రేమకు
అర్థం వెతకగ..దొరకదు ప్రేమకు..!
మాటల సారం..ఇమడదు ప్రేమకు..!
వ్రాయక తప్పదు..లేఖలు ప్రేమగ..
చిరునామాయేం..ఉండదు ప్రేమకు..!
మోహం వలనే..బంధనాలు లే..
కోర్కెల దాహం..పుట్టదు ప్రేమకు..!
బాంబులు క్షిపణులు..ద్రోణులు దేనికి..
వేటాడటమే..తెలియదు ప్రేమకు..!
చెలిమికి చక్కని..అద్దం తానోయ్..
ఎవరేమన్నా..పట్టదు ప్రేమకు..!
ప్రేమించానని..చెప్పడ మేమిటి..
రూపం విడిగా..మిగలదు ప్రేమకు..!
