సాయిచరితము-24
సాయిచరితము-24


ప: నిను తలచిన సాయీ
సర్వము సాధ్యము
నిను కొలిచిన మనసుకు
ఆనంద పర్వమిక
చ: ఆపదలే ఎదురైనచో
దైవమై కాపాడుదవు
మార్గము దుర్లభమైన
వెన్నంటి నీవుందువు
చ:షిరిడీదెంత భాగ్యమో
నీస్పర్శతో పులకించినది
నినుచేరు భాగ్యము
మాకెన్నటికో..మాదేవదేవా
చ: మనుషులము మేము
సద్గురు సేవలో తేలియాడని
మనసులు మావి...దయచూపి
ఆదుకో సాయీ..నీబాటనే
మాకొసగవోయీ..
సి.యస్.రాంబాబు