వర్తమాన వెలుగు
వర్తమాన వెలుగు


వర్తమానపువెలుగు
ప్రతి బుక్ ఫెయిర్ లోనూ
ఆ చెట్టు చాలా ఫెయిర్ గా
అందరినీ ఆదరిస్తుంది
మిలమిల మెరిసే నక్షత్రాల్లాంటి ఆకులతో
ఎవరో ప్రతిష్ఠించిన క్రిస్మస్ ట్రీలా తళుక్కుమంటుంది
ఆశలు అడుగంటి అడుగు పడనివేళ
తననీడపొడ రక్షించే ఛత్రంలా లాలిస్తుంది
ఎందుకుంత నిరాశని వాదిస్తుంది
దేహీఅనేచోటెందుకు దేశమే నీదంటూ
దీనావస్థలో దీనార్ లా
వెలుగు మినార్ లా సాక్షాత్కరిస్తుంది
స్థిరత్వత లేని కాలం..
అస్థిరతల ఆపోసనతో
ఎప్పుడైనా కాటేయెచ్చన్న ఎరుకను
ఆసాంతం నింపుకున్న అయస్కాంతం ఆచెట్టు
రేపును నమ్మదు..తనపై ఉన్న రేటును నమ్ముతుందేమో
నిత్యం వర్తమాన మై వెలుగుతుంది
రేపటి గొడ్డలి దెబ్బకు సిద్ధపడుతూ..