నాయకులు వినాయకులు
నాయకులు వినాయకులు
అప్పులు తెచ్చి గొప్పలా
తప్పులు చేసి తిప్పలా
బావిలోని కప్పలా
ఉడకలేని పప్పులా !!
నాయకులా వినాయకుల
నోటులతో వోటులా
తిరిగేవి రహదారుల
తొక్కేవి అడ్డదారులా !!
అధికారమా అహంకారామా
అవినీతా బంధుప్రీతా
వాగ్దానామా వాగ్బాణమా
నాయకత్వమా నాటకమా !!
చక్కని రక్షణ ముడుపుల భక్షణ
లేదే బాధా కారు హోదా
మనుషులు కాదా మానవత్వం లేదా
ఒక్కొక్కడిది ఒక్కో గాధ !!
పెదవి చిరునవ్వు పదవి వరకే
నానా నాటకాలు నాయకత్వము కొరకే
ప్రజలముందు గాలాభాలు ప్రాగల్ భాలు ఊరికే
కడవరకు పదవిలో ఉండాలని కొరికే !!