మాయదారి రాదారి
మాయదారి రాదారి


...........................
కొండలను తొలుచుకుంటూ
సొరంగాలునిర్మించుకుంటూ
పచ్చిక బయళ్ళుత్రవ్వుకుంటూ
నల్లని రాదారి రోడ్లేసుకుంటూ
వ్యాపారవ్యసనం లో
మునిగింది మానవ వ్యవస్థ!
పల్లెలైనా
పంటపొలాలైనా
వ్యాపారవాహనచక్రాలకు
అడ్డొస్తే అణగిపోవాల్సిందే
రహదారిగా మారి పోవాల్సిందే!
అందుకేనేమో?
సేద్యం మానేసి రైతులు
వాణిజ్యం కేసిచూస్తున్నారు
పల్లెకూలీలు ఆటోలు నడుపుతున్నారు!
ఆవులు గేదెల్ని
కబేళాలకెత్తుతున్నారు!
'దళారీమోసకారి
ఆశపోతువాణిజ్యం'
పెరిగే రహదారులచే
వ్యాపించేవ్యాథియై
పాడిపంటల్నిపట్టిపీడిస్తోంది!
పరదేశమాయశైలి
పట్నం మోజుగ మారి
కబళమిచ్చు పల్లెల్ని
కబళించివేస్తోంది
కనిపించని శత్రువై
మన మానవజాతినే
ఆకలితో చచ్చేలా కుట్రేదో చేస్తోంది!!