మకిలి మనిషి...శ్రీనివాస భారతి
మకిలి మనిషి...శ్రీనివాస భారతి


సూర్యుడు
ఆకాశంలో విజృంభిస్తున్నాడు
ఉదయం నుండే
నల్లాల్లోని నీళ్లు
మరుగుతూ బెదిరిస్తున్నాయి
పక్షులు
రెక్కలల్లాడిస్తూ
నీడకోసం, గూడుకోసం
అదేపనిగా తిరుగుతున్నాయి
బావులన్నీ
నోళ్లుతెరుచుకు
ఆకాశంవైపు చూస్తున్నాయి
ఆర్తిగా
చెట్లు
వృధా పోయే నీటికోసం
జాలిగా వెదుక్కొంటున్నాయి
తెలివైన మానవుడు మాత్రం
పావలా వస్తువునుండి
పాతిక లక్షల ఖరీదైన వస్తువులే ఐనా
ప్లాస్టిక్ నే కోరుకొంటూ
జంతువుల్ని చంపేసి
చెట్లని నరికేసి
చెత్త ని భుజాల కెత్తుకొంటూ
తన గొయ్యి తానే తవ్వుకొంటున్నాడు.
-------$$$$$$$$$$$---------