కాలం చేసిన గాయం
కాలం చేసిన గాయం


మనస్సు కలుక్కుమంది
నే బాధపడితే చూడలేని వాడివి
నేనేడ్చినా పట్టించుకోకుంటే
గుండె నీరైంది
అన్నం లో నీ ప్రతి రూపం
అలనాటి తీయని జ్ఞాపకాలు నేమరేస్తుంటే
కనీసం తిన్నావా ...అని అడగని
నీ కర్కశత్వానికి మనసు చేదైంది
నీ ప్రేమ లేని జీవితం శూన్యమనిపించింది
నీ వాక్కులు లేని ఇల్లు నరకమనిపించింది
నిన్ను రంజింప జేయని బ్రతుకు వ్యర్ధమనిపించింది
నీ నీడలేని జీవితం నిరర్ధకమనిపించింది
నువ్వు లేని నేను లేననిపించింది
నీ మాటల తూటాలు గుండెను గాయం చేస్తుంటే
చేజారిన స్వప్నం చెల్లాచెదురై
కాలం చేసిన గాయం మానని పుండై
ఈ జీవనజ్యోతిని కొడిగట్టిన దీపం చేసింది.
అయినా నా మది దీపం మన్నులో కలిసే వరకు
తప్పు తెలుసుకుని వచ్చే నీకోసం
రెప్పవాల్చని కళ్ళ లోగిళ్ళతో నిరీక్షిస్తూనే ఉంటాను
**************