STORYMIRROR

sujana namani

Tragedy

4  

sujana namani

Tragedy

కడసారి చూపు

కడసారి చూపు

1 min
375


కడుపు కట్టుకుని పైసా పైసా కూడబెట్టి చదివించితే

ఫలితం దక్కెట్లు ప్రధమశ్రేణి వస్తే మురిశాను

అంచెలంచెలుగా మెట్లెక్కుతుంటే

ఆనందం అంబరాని కేగిసింది

ఆరోగ్యం పట్టించుకోక , ఉన్నదంతా ఊడ్చిపెట్టి

విమానంలో  విదేశాలకంపాను’

రెక్కలు ముక్కలు చేసుకుని చేసిన కష్టం

రెక్కలొచ్చి స్వేచ్చా విహంగం లా ఎగురుతుంటే మరిచాను

 ఇప్పుడప్పుడే తిరిగిరావని తెలిసినా

క్షణం క్షణం తల్చుకున్నాను

నీ కిష్టమైనవి నీ పుట్టినరోజు కు చేసి మురిశాను

ప్రాణం లేని తీగలో నీ కంఠం తో తృప్తి పడ్డాను

వెబ్ కెమెరా లో నీ రూపం చూసుకుంటూ

ప్రతిరోజూ మైమరిచాను

నాలో నేను నీ రాకకై ఎదురుచూస్తూ

వానదేవుడు కల్లాపి చల్లితే

నక్షత్రాలను ఏరుకొచ్చి రంగవల్లులు దిద్దాను

పసిడిరంగు కడపలకు రత్నాల రంగులద్దాను

అందాల హరివిల్లును తోరణం కట్టాను

వెండి మబ్బులను తెచ్చి కుర్చీలు వేసాను

ఎదురు చూసే కళ్ళని ద్వారానికి వేలాడదీసాను

నీకై చూసి చూసి

కళ్ళు కాయలు కాసాయి

భూదేవి తో ఋణం తీరిందని

 మంచి చెడుల అప్పగింతలు అయినవాళ్లకు అప్పగించాక 

జీవనజ్యోతి నింగిలో కలిసిన వేళ

నా పిలుపు నిను చేరినట్లు

నీవు వచ్చావు ....కానప్పటికే

అందనంత దూరమేల్లాను నేను

నీ కడసారి చూపుకై తపించిన దేహం

నిను చూడకుండా నిస్తేజమయింది

**********



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy