STORYMIRROR

M.V. SWAMY

Tragedy

5.0  

M.V. SWAMY

Tragedy

ఏమిటి నాన్నా నీ సిద్ధాంతం

ఏమిటి నాన్నా నీ సిద్ధాంతం

1 min
373

ఏమిటి నాన్నా నీ సిద్దాంతం!!!


నీ కాళ్లపై నన్ను నిలబెట్టి నడిపించావు


నీ భుజాలుపై నన్ను కూర్చోబెట్టి పరిగెత్తావు


నా ఆకలి తీర్చడానికి నీ కడుపు మాడ్చుకున్నావు


కలిమి ఉన్ననాడు నాకోసం లేనినాడు నీకోసం


ఏమిటి నాన్నా నీ సిద్ధాంతం!



అమ్మ నన్ను కొట్టబోతే అడ్డుకున్నావు


నేను దొంగలిస్తే నిందలు నువ్వు తీసుకున్నావు


నన్ను ఎవరు మందలించినా.....


నువ్వు క్షమాపణ కోరుకున్నావు


ఏమిటి నాన్నా నీ సిద్ధాంతం!



పరీక్షలు నాకైతే ఒత్తిడి నీకు


నేను ఆలశ్యం కాకుండా నువ్వు


పరుగులు పెట్టి అలిసి ఆనందపడ్డావు


ఉత్తీర్ణత నాదైతే నీ కళ్ళలో కాశ్మీరం


ఏమిటి నాన్నా నీ సిద్ధాంతం!



ఆస్తులు అంతస్తులు నాకిచ్చి...


కష్టాలు...నష్టాలు నువ్వు భరించావు


నా కంటిపై పాపవు నువ్వై లోకం చూపించావు


ముళ్ల పాన్పుపై పరుండి నాకు దూది పరుపులు


ఏమిటి నాన్నా నీ సిద్ధాంతం!



నేను మెరుపు అవ్వడానికి


నువ్వు మేఘాలై మధనం పడ్డావు


నన్ను ఇంద్రధనుస్సుగా చూడడానికి


నువ్వు ఎండవానలై ఎంతో శ్రమించావు


ఏమిటి నాన్నా నీ సిద్ధాంతం!



అమ్మ నాఆత్మ,అమ్మకు పరమాత్మ నువ్వు


సవ్యసాచివైనావు...రథసారథివై నువ్వు


ముందు మార్గమందు ముళ్ళు తొలగించి


వెనుక అంగరక్షకుడై నన్ను కాపాడినావు


ఏమిటి నాన్నా నీ సిద్ధాంతం!



విత్తుగా ఉడిచి నన్ను వటవృక్షచేసి


నీ కడవరకూ కరుణమయుడయ్యావు


ఎన్నదగిన నా కథానాయకుడవు నీవే


ఎందుకో...నా వీరభిమానివయ్యావు


ఏమిటి నాన్నా నీ సిద్ధాంతం!



అమ్మ కన్నుమూస్తే నన్ను చంటిపాపగా చూసావు


నా పాదంలో ముళ్ళు నాటుకుంటే....


నీ అరికాలుకి వాపు ఎన్నిసార్లో చూసాను


నీ ఎదపై నన్ను తాండవ కృష్ణుడ్ని చేసావు


ఏమిటి నాన్నా నీ సిద్ధాంతం!



నన్ను వెన్నెల చెయ్యడానికి జాబిలివయ్యావు


నాకొడుకు నన్ను నాన్నా అని పిలిస్తే ....


ముసి ముసి నవ్వులతో మురిపెము అయ్యావు,


అందుకేనా నాన్నా మీ నాన్న జాగ్రత్త అన్నావు.


నేను కనుమూసే వరకూ కనిపిస్తావనుకుంటే


ఎంత వెదికినా అగుపించని లోకాలకు


వెడలి పోయావు, ఇంతలో ఏమైంది నాన్నా నీకు!


నను ఒంటరిని చేసి నా చుట్టూ జనమయ్యావు


ఏమిటి నాన్నా నీ సిద్ధాంతం!!!

















Rate this content
Log in

Similar telugu poem from Tragedy