భగ్న ప్రేమికుని స్వగతం
భగ్న ప్రేమికుని స్వగతం


నాలో నేను
లేనే లేను
నీకేం కాను
నీకోసం నేను
నిజమైనాను
నిప్పులు దాచిన నీలి కన్నులనయినాను
నీ విరహములో రగిలిన వెన్నెల రాత్రినయినాను
అహోరాత్రాలు నీ స్పర్శ కోసం తపించాను
అమెజాన్ అడవిలా దహించుకుపోయాను
నిన్ను చేరాలని ఆరాటపడ్డాను
నాలో నేను
లేనే లేను
నీ మీద ప్రేమతో నన్ను నేను మోసం చేసుకున్నాను
నిన్ను వదులుకోలేక నా గౌరవాన్ని వదులుకున్నాను
నీ అబద్ధపు వాగ్ధానాల ఫలితంగా నా భవిష్యత్తును కోల్పోయాను
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు
ఇలా చేతకానివాడిలా
ఏకాకిలా
మిగిలిపోయాను
అందరికీ దూరమయ్యాను
నాలో నేను లేనే లేను
బ్రతికుండీ శవమయ్యాను