వస్తావా నేస్తమా
వస్తావా నేస్తమా
ఏమని చెప్పను
ఎందుకు నువ్వు నాతో మాటాడవంటే
ఏమని చెప్పను
ఎందుకు నువ్వు నన్ను అసహ్యించుకుంటావంటే
ఏమని చెప్పను
ఎందుకు నువ్వు నన్ను దూరం పెడుతున్నావంటే
విధి ఆడిన వింత నాటక ఫలితమనా
ఇతరులు సృష్టించిన పరిస్థితులనా
ఏమని చెప్పను అడిగే వాళ్ళకు
ఏమని చెప్పను నను చూసి నవ్వే వాళ్లకు
ఎలా నిరూపించను
నా తప్పు లేదని
నా కన్నీళ్లు మింగి నవ్వడం నేర్చుకున్నాను
నువ్వు నాకు సాయం చెయ్యకపోయినా
నాకు నేనుగా నిలబడడం నేర్చుకున్నాను
నలుగురూ చేసిన నిందలు నమ్మి
నువ్వు నా నుంచి దూరమైనా
నాకు ప్రతికూలంగా మాట్లాడినా
నే చిరునవ్వుతో స్వీకరించడం నేర్చుకున్నాను
ఓటమి పాలయినందుకు అందరూ ఎగతాళి చేసినా
ఆత్మ విశ్వాసంతో తిరిగి నిలబడ్డాను
అపజయాలెన్ని వచ్చినా
విజయం కోసం ప్రయత్నం చేయడం నేర్చుకున్నాను
నే నుంచి దూరం కాబడ్డప్పుడు పొందిన బాధ
నాలో మరొకరి బాధను అర్థం చేసుకునే తత్వాన్ని పెంచింది
సేవ చేసే లక్షణాన్ని కలిగించింది
కానీ ప్రియ నేస్తమా
నీవన్న మాటలు
అపార్థం చేసుకొని
నా నుండి జీవితాంతం దూరం అవుతానని చేసిన ప్రతిజ్ఞలు
నన్ను వెంటాడుతున్నాయి
పుండు పడిన చోట కారం చల్లినట్లు
లోకం నన్ను విమర్శిస్తోంది
కాలం మిగిల్చిన గాయం
నీ కౌగిలిలో ఒదిగి మానిపోవాలనుకుంటోంది
వస్తావా నేస్తమా
నీ మనసులో కాస్త చోటిస్తావా నేస్తమా