సింహవలోకనం
సింహవలోకనం
ప౹౹
వికారికింకా సమయమయిన ముగిసినట్లూలేదు
శార్వరికింకా ప్రారంభము అయినట్లయినా లేదు ౹2౹
చ౹౹
అయినా ఆంగ్ల సంవత్సరం అడకగనే ఆగమనం
ఆ కాలగర్భంలో కలిసే మానానికి సాక్షులం మనం ౹2౹
కొత్త సంవత్సరం మందుసీసాలతో మత్తు పెరుగు
చిత్రంగా చిరు దీపాలానార్పిన వెలుతురే తరుగు ౹ప౹
చి౹౹
ముగియని సంవత్
సరానికి అపుడే ముసుగేలనో
తెలియని ఆ ఆంగ్ల వత్సరానికా అందలమేలనో ౹2౹
తెలుగుకు పాతరేసే ఆ తెగులే బాగా ముదిరిందీ
వెలుగుకు ఉరివేసే గుణం బహుబాగా కుదిరిందీ ౹ప౹
చ౹౹
సింహవలోకనం చేసిచూడ సిగ్గనిపిస్తొంది కదూ
పుంభావ సరస్వతులకు పుట్టగతులే లేవుకదూ ౹2౹
మూర్ఖులకు మూఢులకూ కలిసి వచ్చిన కాలం
మూర్ఖత్వపు 2019లో భరించలేని హాలాహలం ౹ప౹