దేశంబు తెలుగేను
దేశంబు తెలుగేను
ప౹౹
దేశ భాషలందు తెలుగు లెస్సన్నారు ఒకనాడు
లేశమైన ఎగ్గులేక లెస్ అని చూపించారు నేడు ౹2౹
చ౹౹
తెలుగదేలయన్న దేశంబు తెలుగని నినదించే
తెలుగు కావ్యాలెన్నో కడు రమ్యంగ ప్రసాదించే ౹2౹
ఆనాటి పాలకులు చూపిన చొరవనూ కనలేరా
ఈనాటి మరగుజ్జు వింత వాదన ఖండించలేరా ౹ప౹
చ౹౹
బ్రిటిష్ నాణేలనూ తెలుగులోను ముద్రించారు
ఇటాలియన్ ఆఫ ది ఈస్ట్ అని ఆనందించారు ౹2౹
శాస్త్రీయ సంగీతమంటేను అందరికీ తెలుగేను
శాస్త్రసమ్మతంగా నలుగురి నోట మరి వెలెగేను ౹ప౹
చ౹౹
అణా కాణి వాదనతో మా భాషనే తొలగిస్తారా
అర్థంకాని పేచిలతో తెలుగునే అవమానిస్తారా ౹2
చచ్చిందా తెలుగు జాతి పౌరుషమే నిలువునా
చచ్చేదాకా పోరాడక గెలుపొచ్చేనా సులువునా
వచ్చేనా తెలుగు భాషకు నెలవు నువే పోరాడక
అణవణవునా ౹ప౹