మనసా ఎంత బావుణ్ణు
మనసా ఎంత బావుణ్ణు


నువ్వు దారి తప్పకుండా ఉండుంటే
నీ పని నువ్వు చేసుకుంటూ ఉండుంటే
అలాగే అని ప్రతీ సారీ ఒప్పుకోకుండా ఉండుంటే
మనసా ఎంత బావుణ్ణు
ఎవరి స్నేహం కోసమో నీ విలువల్ని వదులుకోకుండా ఉండుంటే
ఆ స్నేహం విషయంలో ఏమరుపాటుగా లేకుండా ఉండుంటే
ఏది ఏమైనా నీ కోసం నువ్వు పోరాడుంటే
మనసా ఎంత బావుణ్ణు
నీకీ విషపు జ్ఞాపకాలు మిగలకుండా ఉండుంటే
నీకు కన్నీళ్లు బహుమతిగా కాకుండా ఉండుంటే
విద్వేషాల మధ్య చిక్కుకోకుండా ఉండుంటే
మనసా ఎంత బావుణ్ణు
నీకు ప్రేమ దక్కుంటే
లేదా
నువ్వు ప్రేమించకుండా ఉండుంటే.