బతుకు బుట్ట ( లైఫ్ బాస్కెట్ )
బతుకు బుట్ట ( లైఫ్ బాస్కెట్ )


బతుకుబుట్ట
———————
ఈ బుట్ట ఎవరిదో ? తెలీదు
ఎవరు తయారీ యో? తెలీదు
యజమాని ఎవరో ? తెలీదు
అయినా బాగుంది
లోకమ్మొత్తం ఇందులో వుంది
యుగయుగాలుగ కనబడ్తోంది
ఇది ఈ లోకపు బతుకుబుట్ట
ఇది భూగోళపు మట్టి తుట్టె
గట్టుల్లేని గుట్టుతెలీని పెద్దబుట్ట
కష్టసుఖాల ఘటనల గుట్ట
నవరసాల భావాల చిట్టా
అనుభవ చరితల జ్ఞాపకాలకట్ట
పుట్టగానే
పట్టుకుంటుంది
పొట్టనదాచిపెట్టుకుంటుంది
బాధ్యతగాప్రేమగా
గట్టిగ పొదివిపట్టుకుంటోంది
పద్ధతిగా శ్రద్ధగా
గాదిరాజు మధుసూదన రాజు