నకిలీ అవుతోంది రచనం !
నకిలీ అవుతోంది రచనం !


...............................
అనుభవాలు కాదు
కంఠస్థంచేసినవి కాదు
చదివి గుర్తుంచుకున్నవీ కాదు
ఖాలీ మెదళ్ళతో వచ్చి
అంతర్జాలంలో కళ్ళతో వెదకి
పేస్టింగు ఆప్షన్ వ్రేళ్ళతో గబగబా తెచ్చి
వ్రాసేస్తున్న దంతా..
తమ స్వంతమైనట్లు బడాయి!!
గంటగడిచాక అడిగితే
తాను వ్రాసిందేమో ?
వ్రాసినోడికే తెలీదు!
నకిలీ అవుతోంది రచనం!
నవ్వులపాలౌతోంది జ్ఞానం!!