దూరం కుదింపు యంత్రాలు
దూరం కుదింపు యంత్రాలు


....................................
సౌకర్యాలన్నింటినీ
సులభతరంచేస్తూ
విజృంభిస్తోంది విజ్ఞానశాస్త్రం
దూరవాణి రూపంలో...
తీగలతో మొదలై
యాంటెన్నాలతో సాగి
అనంతదూరాల్ని కలుపుకొని
అనుబంధతంత్రుల్నితెంచుకుని స్వరవాణి కరవాణిచరవాణియై
పరికరాలబలంసరిచేసుకుంటూ
అనుసరిస్తోంది మనమనుగడలో భాగమై!
మనసుల్లోని భావాల్ని
పెదవులమధ్యలోంచి
ఇతరులకు చేర్చే మహామధ్యవర్తియై!!
మనోవేగంతో
అనంతదూరాలను
అంగుళాలదూరంలో
అనుసంధానిస్తూ
పలికేభావాలను
చెవులకు చేర్చే
అద్భుతవస్తుచమత్కారాలు ఇవే!చూడండి!సంతృప్తిగా!!
అందించటం నమస్కారాలు !మనిషిగా!కృతజ్ఞతాపూర్వకంగా!!