తొలి పయనం
తొలి పయనం


జీవితంలో అయ్యెను అప్పుడప్పుడు పయనం,
జీవితకాలమే స్వయంగా ఒక ప్రథమ పయనం,
మేను స్వతహాగా ఇలవేల్పు ఇచ్చిన ఆయతనం,
జీవనయాత్రలో అతిముఖ్యమైనది ఇహలోక జ్ఞానం |౧|
సజీవ జీవనయాత్రలో ముందుగా వచ్చెను పసితనం,
కోమల కిశోరప్రాయం అనంతరం వచ్చెను యవ్వనం,
ఈ ప్రాయం అందమైన వసంత సమయంతో సమానం,
ఏంతో సంఘర్షభరితమైనది ఆఖరి వేళ ముసలితనం |౨|
మరువలేనిది ఈ బ్రతుకు ప్రయాణ విధానం ,
అందరికి జ్ఞాపకం ఉండేది ఈ తోలి పయనం,
ఉండాలి ఈ ప్రయాణానికి సరైన ప్రయోజనం,
అన్ని పర్యాయాలలో నేర్చుకోండి మంచితనం |3|