Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

jayanth kaweeshwar

Drama


5.0  

jayanth kaweeshwar

Drama


ప్రబోధాత్మక కవితా గీతం

ప్రబోధాత్మక కవితా గీతం

3 mins 382 3 mins 382


పల్లవి : వద్దురా చిన్నీ – శిథిలమై పోవద్దురా కన్నా

తంబాకు ను నమలద్దు , గుట్కా తినొద్దు – ఊయోద్దు రా !౟

వితం కావోద్దే అంధకార బంధురం , నోట్లో పుండ్లను పెంచొద్దురా


// వద్దురా చిన్నీ //


చరణం 1 : ధూమపానం తో నీకే కాక – ఇతరుల ఆరోగ్యం క్షీణించేనురా !


మాదక ద్రవ్యాల తో శరీరాన్ని – తూట్లు పోడుచుకొంటూ శిథిల మౌతావేరా?


నీకంటూ లేవా ఆశలూ-ఆశయాలూ – జీవన ధేయం కనరాదా ?


మీరు బాధ పడి – మీవాళ్ళను బాధపెట్టి – ఏమి సాధిస్తారు? ఏమి సాధించేరు ?


// వద్దురా చిన్నీ //


చరణం 2 : ఊపిరి తిత్తుల కేన్సర్ వచ్చేను – ధూమ పానం వల్ల


హుక్కా ఒక గుక్కా నీకు మజానంటా , నడిపేవారు నిన్ను దోచుకుంటారంటా


మీ ఉసురు తీస్తుంది – శ్వాస నిలువదురా మీకు – దీనితో తంటాఅంటా


పెద్దల మాటలు చద్దుల మూటలు రా – ఇవి అన్నీ మీ మంచికే నంటా రా


// వద్దురా చిన్నీ //


చరణం 3 : కడుపులో మంట , గొంతులో తంటా , నీ మెదడు నీ సోయి లో లేదంటా


మద్యపానం చేయడం నీకు సరదా నంటా , ఎదుటివారి జీవి హరీ అంటా


రక్తం కలుషితమంటా , నీ శరీరం నీకే తెలియక దొ(డో)ల్లునంటా


వాహనములను అట్లనే నడుపుతావంటా , నీ తల్లి దండ్రులకు జైలంటా


/ / వద్దురా చిన్నీ //


చరణం 4 : ఎందుకో మనసు లాగుతుందంటావు , పెద్దలను కష్ట పెడుతుంటావు


వద్దంటే విననంటావు , ఏవో నేరాలు చేస్తానంటావు


మాను మంటే మాననంటావు, అదే కదా ణా సరదా అంటావు


మంచిగా ఉండమంటే , ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు//వద్దు రా చిన్నీ //


చరణం 5 : ధనాన్ని ,సమయాన్ని , అభివృద్ధిని పణంగా పెట్టొద్దు బాబూ


మంచి చెప్పే మిత్రులను , పెద్దలను దూరం పెట్టొద్దు రా కన్నా !


దురాలోచనలతో మంచి పనులకు విఘాతం కలిగించొద్దురా చిన్నా !


గాంధీ జీ – మూడు సూత్రాలతో పాటు నాల్గవ సూత్రాన్ని విడువద్దురా బాబూ !//వద్దురా చిన్నీ //


ముగింపు : “ చెడు కనవద్దు , చెడు అనవద్దు , చెడు వినవద్దు మరియు చెడు

చేయవద్దు ఇది బాపూజీ పిలుపు , అదే మేలుకొలుపు”

వ్యసనాల బారిన పడే , పడిన , పడబోతున్న యువతకు , పెడత్రోవన

ఎగదోసే దుర్మార్గుల నుండి ఆమడ దూరం గా ఉండండి , తస్మాత్ జాగ్రత్త !


ఈ ప్రబోధాత్మక వచన గీతాన్ని చదివి , పాడి , ఆచరించి , సన్మార్గంలో

పయనించి యువతరానికి మార్గ దర్శకులు గా మారండి . మొన్నటి తరం, నిన్నటి

తరం, నేటి తరం , రేపటి తరం తర తరాల కు సరిపడా మొదటి అడుగు వేసి , మార్గ

దర్శకులు గా మారండి . అదృష్ట వంతులు, ఆదర్శ వంతులు , ఆరోగ్య వంతులు గా

మారే యువతకు ఆశీస్సులు , అభివాదములు .Rate this content
Log in

More telugu poem from jayanth kaweeshwar

Similar telugu poem from Drama