. అర్ధాంగి
. అర్ధాంగి


ఎందుకీ చులకన...
నువ్వే లోకమని..
నీ తోడిదే జీవితమని...
నిన్ను నమ్మినందుకా..
నీ సంతోషమే...
తన తపనగా...
నీ అవసరాలే...
తన దినచర్యగా..
మలుచుకున్నందుకా...
తన విలువ శూన్యమని..
తనకంటూ వాక్కు కరువని...
తెలియ చెప్పినా...
నోరు మెదపక...
నిన్ను అన్వయించినందుకా...
ఎందుకీ చులకన...
తనవారిని కాదని...
నువ్వే ప్రపంచమని...
తన ప్రాణం...
ఊపిరి నువ్వని...
బ్రతుకుతున్నందుకా...
తన ఇష్టమేంటో ...
ఎప్పుడు మరిచిందో....
నీ ఇష్టమే నా ఇష్టం...
అనే భావనలో...
తన అస్తిత్వాన్ని ఎపుడు కోల్పోయిందో ...
నిన్ను నీ కుటుంబాన్ని ముందుకు నడిపే మార్గంలో...
ఎందుకీ చులకన...
లేదా ఈ ప్రశ్నకి వివరణ?...