నాన్న
నాన్న

1 min

263
అమ్మని అడిగా నాన్న అంటె ఎమిటి అని
చుపించింది ఎదురుగా ఉన్న అతి పెద్ద ఆశనాని
ఆ రొజు అనుకున్నా నాన్నంటే రాజు అని
అక్కని అడిగా నాన్న అంటె ఎమిటి అని
చూపించింది కొత్తగా తెచ్చినా బంగారు నగని
ఆ రొజు అనుకున్నా నాన్నంటే కుభెరుడని
పంతుల్ని అడిగా నాన్న అంటె ఎమిటి అని
చూపించాడు ఆ రొజు నాకు కట్టిన రసీదు కాగితాని
ఆ రొజు అనుకున్న నాన్నంటే నా భవిష్యతుకు దిక్సూచి అని
నా కాల పై జీవితం పరుగు తెచ్చింది నాన్నకి నాకు దూరాని
ఇప్పుడు అడగండి నాన్న అంటే ఎమిటి అని
బదులుగా చూపిస్తా చేతికి అందని ఆకాశాని