నిజం
నిజం


నీ మాటల మంత్రం మైమరిపిస్తుంటే
పగలు రాత్రిని మరిపిస్తుంటే
నేను అనుభవించిన అద్భుతాలు
నిజం కాదా
నేను ఎక్కినా కొండలు
నా ముందు వెలిసిలినా మేడలు
నేను పరుగాడినా పచ్చని పైర్లు
నాకు తొడుగా నడిచిన నా మిత్రులు
నిజం కాదా
నాకు పాటాలు చెప్పకనె చెప్పిన పంతులు
నా తప్పులు ఎత్తి చూపిన నీ వేల్లు
నన్ను మనిషిని చేసినా నీ ప్రతి మాటలు
నిజం కాదా
ఓ నా పుస్తకమా
నువ్వు ఒక కవి కల్పనవెనటా
నువ్వు అశావది ఆశకి రూపమటా
నువ్వు చేతికి అందని మాయవటా
అన్న ఈ మనిషికి ఎమని చెప్పేది
రవి కాంచనిది కవి కాంచెనెని చెప్పనా
ఆశావాది కన్నులలొ లొకం ఉందని చెప్పనా
మాటల మాంత్రికుడవి కాని మాయలు తెలియవని చెప్పనా
ఎమి చెప్పకున్న ,
నువ్వు నిజం అని చెప్పకపోదునా