మార్పు
మార్పు


అలారం కూతలకు
కల్లు తెరిచి
పాలవాడి మొతకు
మత్తు వదిలి
మీటింగు గోలలొ
చొక్క తగిలించె
ఓ ఆశావాది
మారాము చెయ్యక
మారిన వర్షంలొ
మార్పులు వెతుకు
మరవకు చాట్ జీపీటీ
చెయకలిగిన మార్పులని
మాయలని
చీకటి చీల్చే తెల్లారి సూర్యుని అందం
గాలి రెప రెపలకి ఉగులాడే ఆకుల నాట్యం
వాన జల్లులొ మట్టి సుగంధం
మనకే సొంతం
మరి ఎందుకు అలస్యం
మ్యాషిన్లకు అందని ఆశయాలు కాని నీ కైవసం
మానవాలికి కాని నీ మార్పు ఒక కొత్త మార్గం