బాంధవ్యాలు
బాంధవ్యాలు


పుట్టుకతోనే పోగేసుకున్న ఆస్తులు
రక్తపు పొరల్లో నిక్షిప్తపు నిధులు
ఎప్పటికీ వదిలి పోని బాంధవ్యాలు
డొక్క పట్టుకొని రెక్కలతో
ఏ దిక్కుకు ఎగిరెళ్లినా
మలినమవ్వని మూలాల మలుపుల్లో
పదిలంగా దాచుకున్న అనుబంధాలు
నైతికత మెట్లు ఎక్కుతూ
జారి పడిబోయిన ప్రతిసారీ
నీతి నియమాల నిలువెత్తు నిదర్శనంగా
నిలబెట్టింది ఆ బంధాలు బందిఖానా
ఒంటరితనం నీడ పడకుండా
భయం భరోసాకాలేని చోట
బంధుత్వం అభయం గా నిలిచింది
జీవితపు చివరి మెట్టుపై కూర్చుని
శున్యాన్ని నింపుకుంటున్నప్పుడు కూడా
రాలే రెండు కన్నీటిబొట్లయింది
మార్చుకునే నాలుగు భుజాల బరువయింది
ఆర్తిగా పిలిచే దింపుడు కళ్ళాల పిలుపైంది