అమ్మంటే
అమ్మంటే


అమ్మంటే
*******
తన కడుపు మాడినా
బిడ్డ కడుపు నింపేది అమ్మ
తానూ కాలుతూ
బిడ్డను రక్షించేది అమ్మ
తిట్టినా కొట్టినా
బిడ్డ క్షేమాన్ని కాంక్షించేది అమ్మ
దుర్మార్గులైనా దుష్టులైనా
భూదేవంత సహనంతో మన్నించేదే అమ్మ
తప్పులన్నీ తనవేనంటుంది
విజయాల్ని మాత్రం బిడ్డలవంటుంది
అనుక్షణం అహరహం
బిడ్డ కోసం తపిస్తుంది
వారి కోసమే జీవిస్తుంది
ఎవరెన్ని నిందలేసినా సహిస్తుంది
ఎవరెన్ని శిక్షలేసినా భరిస్తుంది
అమ్మంటే అమృతం
అమ్మంటే ఆత్మీయత
అమ్మంటే ఆప్యాయత
అమ్మంటే ఆదర్శం
అమ్మంటే వాత్సల్యం
అమ్మంటే అండదండ
అమ్మంటే అనిర్వచనీయం
అమ్మతనం అనితరసాధ్యం
కష్టాలను కడుపులోదాచి
కనికరాన్నే కురిపిస్తుంది
కన్నీళ్లను కనురెప్పల మాటున అదిమి
సంతోషాన్ని అరువు తెస్తుంది
**********
-నామని సుజనాదేవి