బాధ
బాధ


చిరునవ్వులు నిముషంలోనే చిందు లేస్తాయి
ఆప్తమిత్రుల మధ్య శత్రుత్వపు మొలకలు
కన్న కూతురిని ఆవహించిన కామ పిశాచం
విరోదంలో మునిగిపోయే అజాత శత్రుత్వం
ఆత్మీయతలో అపరిచితులు
అణా కు కరిగిపోయే కోటీశ్వరులు
దాంపత్య సముద్రంలో బడబాగ్ని
ప్రశాంతంలో భీభత్సవం
భీభవత్సవంలో వికటాట్టహాసం
కుటుంబ జీవనానికి ‘’ఆక్సిడెంట్’’
ఎన్నికల్లో ఏరై పారే ఎర ...వ్యసనానికి బానిస
ఇదంతా నీ చలువే
మద్యమా నీ చలువే
సత్వరజోగుణముల నాయికా
వ్యసనానికి వేదిక
నిన్ను చూస్తె కోపం రావడం లేదు
కారణం....జీవం లేకున్నా హానికరం
అని నీకు నువ్వే తెలియజేప్పుతున్నావు
కాని...వివేకం తెలిసిన మనిషి మాత్రం
అన్ని రకాల హాని అని తెలిసీ
నిన్ను ఆహ్వానిస్తున్నాడనే నా బాధ .
**************