ఏకం - అనేకం
ఏకం - అనేకం
ఒక్కడే దేవుడు- విశ్వాలు అనేకం
ఒకటె విశ్వం -నక్షత్ర మండలాలు అనేకం
ఒక్కటే నక్షత్రమండలం - గ్రహాలు అనేకం
ఒక్కటే గ్రహం - జీవరాశులు అనేకం
ఒక్కటే జీవం - జీవ రూపాలు అనేకం
అందులో
ఒక్కడే మనిషి - మనుష్య లక్షణాలు అనేకం
ఒకటే లక్షణం - వారి లక్ష్యాలు అనేకం
ఒక్కటే లక్ష్యం - లక్ష్యం చేరే గమనాలు అనేకం
ఒకటే గమనం - గమనము కై సాగించే ఆలోచనలు అనేకం
ఒకటే ఆలోచన - కనే కలలు అనేకం
ఒకటే కల - ఊహలు అనేకం
ఒకటే ఊహ - కల్పనలు అనేకం
ఒకటే కల్పన - భావనలు అనేకం
ఒకటే భావన - అభిప్రాయాలనేకం
ఒకటె అభిప్రాయం- దానిపై అనుమానాలనేకం
ఒకటే అనుమానం- దాని వలన కలిగే సమస్యలనేకం
ఒకటే సమస్య- దానికి సమాధానాలనేకం
ఒకటే సమాధానం - ఏకమై ఉండును అనేకాలు
అనేకములు కలిసి ఆ దైవము లో ఏకమగును.