ప్రేమ గజల్ (1)
ప్రేమ గజల్ (1)


నీ వేకువతో హరివిల్లు ఆడుతుంది చూశావా...
నీ రాకతో కోయిలమ్మ పాడుతుంది చూశావా...
చెలిఅడుగుతో పూలవనం పరిమళంతో పొంగింది
నీ స్పర్శతో తనువునేడు ఉరుకుతుంది చూశావా...
నీ పలుకుల్లో చిలకమ్మ రాగాలెన్నో తీసింది
నీ వాణితో నాబుద్ధిలో జీవమొస్తుంది చూశావా...
నా పక్కన నువ్వుంటే స్వర్గసీమ నాకెందుకు?
నీ తోడుతో నా మనసు ఎగురుతుంది చూశావా...
నీ ప్రియమైన పిలుపుల్లో నా పేరే వినగానే
ఆశ్చర్యంతో నా ముఖము వెలుగుతుంది చూశావా...
ప్రేయసినే వరించేందుకు పడుతున్నా తిప్పలెన్నో
నన్నుచూసి చందమామ నవ్వుతుంది చూశావా...
నీ ఊహలు నా కళ్ళలో మెదులుతుంటే ప్రతిక్షణం
నీ రూపం నా గుండెలో దాగుతుంది చూశావా...
నువ్వెళ్ళే దారిలోన పూలవర్షం కురిసింది
నీ నీడలో నా మేను ఆగుతుంది చూశావా...
మన జతతో శిశిరం చిగురించడం చూశాను
మన ప్రేమతో వసంతం ఊపిరోసుకుంది చూశావా...