ఎపుడైనా....
ఎపుడైనా....


కష్టసుఖాల కడలిలో ఈదావా ఎపుడైనా
సలసల కాగే నీటిలో మరిగావా ఎపుడైనా...
కన్నీళ్ళ సాగరాలు మనలోనే భాగమైన
కురిసేటి కంటిచినుకు ఆపవచ్చా ఎపుడైనా ....
జీవితాన బాధలకు కృంగకోయి ఓ మనిషి!
సుఖాలన్ని తోడొస్తే వద్దంటావా ఎన్నడైనా....
బంధాలు బంధనాలు తెగిపోయే జీవితమే
బ్రతికినన్ని కొద్దిక్షణాలు ముడేయ్యవా నువ్వైనా...
ఛీత్కారాలు ఎదురైతే బాధేలా ఓ గీతం...!!!
సత్కారాలు వరించితే కాదన్నవా కలనైనా....
మురళీ గీతం...!!!
8374885700