అమ్మ
అమ్మ

1 min

588
పిండమై తన గర్భాన చేరితే
పేగుబంధమని మురిసిపోతుంది
నెలనెలా ఎదిగేక్రమంలో చిట్టిపాదాలతో
తన్నితే చక్కిలిగింతలతో చల్లగా నవ్వుతుంది
అప్పుడే పుట్టిన పసిపెదవులు పలికే
తొలిమాటే అమ్మయితే దేవుడు నేర్పిన మాటలంటూ పొంగిపోతుంది
నడకనేర్చుతుంటే నా అడుగులతోడుగా
కదిలే అడుగులు ఆమెవవుతాయి
గతితప్పి పడుతుంటే
కాచే రక్ష ఆమె చేతులు
కదిలే ప్రతికలం అమ్మని అన్వేషించి
తమ అక్షరాలలో రత్నంలాపొదుగుతుంటే
ఇంకేదో భావం మిగిలిపోయిందనేలా
సకలభావాల ఝురి ఆమె