నేటి పరిస్థితి
నేటి పరిస్థితి
నలువైపులా ఉప్పునీటిఊటలు
తాగేందుకు లేవు గుక్కెడుస్వచ్చమయిననీళ్ళయినా
పచ్చని ప్రకృతికి పుట్టినిల్లు
ఆ ప్రకృతిచేసే విలయతాండవానికి
నిలువెత్తు సాక్ష్యం అయింది ఈనాడు
కడుపునింపే పంటభూముల నెలవుఓనాడు కార్పొరేట్ శక్తుల చేతుల్లో
కాలుష్యపుకోరల్లో చిక్కి
బీడుభూములైనాయి ఈనాడు
పల్లెతల్లి ఇచ్చిన స్వచ్చమయిన గాలిలో
నేడువచ్చిచేరిన గాఢమయినవాసనేదో
ననువదలిపొమ్మంటూ తరుముతోంది
కరెన్సీ వెదజల్లిన కంపెనీలకు జన్మనివ్వడానికి
పుట్టిపెరిగిన ఊరు కనుమరుగవుతోంది
వలసలతో యువతను దూరతీరాలకు తరిమికొట్టి
నిత్యం జబ్బులతో కన్నపాశంతో సతమతమవుతూ వృద్ధాప్యం ఒరిగిపోతుంది
నాశనాన్ని జయించి అభివృద్ధి వైపు అడుగులంటూ
మరింత ప్రకృతికి దగ్గరవుతామో
వినాశనానికి హేతువవుతామో