ఎవరు నాన్నా నీవు
ఎవరు నాన్నా నీవు


బంగరు తల్లినని నీ ఎదపై నడిపావు
పసిపాపను నేనంటూ కనురెప్పై కాచేవు
అల్లరి చేసే వేళ స్నేహితునివికాదునీవు
ఆటలతో మరిపించు నాన్నతనం నీ ఓర్పు
సుఖంలో కలిసి నడిచే ప్రేమికునివి కాదునీవు
కష్టంలో వెన్నుతట్టు అమ్మతనం నీఓదార్పు
మదిభాషను దాచుకొని మౌనాన్ని ఆదరించి
బాధ్యతను నెరవేర్చి,నీ ప్రాణాన్ని అతనికి ఇచ్చి
పెళ్ళిబంధంతో మరో ఎదను చేర్చి
పుట్టింటికి దూరమయ్యేవేళ
ఎందుకని నాన్నా ..... కడలై ఉరికే
కన్నీరును నీ ఎదలో నింపావు
చిరునవ్వుల కానుకతో నను సాగనంపేవు