నేస్తం
నేస్తం


నిశ్శబ్దంగా ఎదనుమీటి
ముభావాన్ని చెదరగొట్టి
భుజంతట్టే నేస్తమయ్యావు ఆనాడు
కళ్ళలోన మెదిలేటి
కన్నీటిపొరకు నీవంటే భయం
నన్ను తనకు దూరంచేస్తావని
మనసుకి హాయిగొలిపే తుమ్మెదలా
మమతను పంచే మనసువు నువ్వు
ఎన్నెన్ని బాధ లు కమ్ముకున్నా
సేదతీర్చే నిండు పున్నమినీవు
ఒక్కోఅడుగువేస్తూ నేనెదుగుతుంటే
నా పక్కన మరోజత పాదముద్రలునీవే
ఆకర్షణలకు లోనయ్యేసమయంలో
కట్టడిచేసే అమ్మవునీవే
బాధ్యతలన్నీ చేరువయి
ఎలా మరిచావునేస్తం మన స్నేహాన్ని
స్వేచ్చగా రెక్కలుతొడిగి
చిన్ననాటి జ్ఞాపకాలలోకి ఎగిరెలదాం
స్నేహామృతాన్ని జుర్రుకుంటూ
సీతాకోకచిలుకలమై విహరిద్దాం