Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

jayanth kaweeshwar

Drama

5.0  

jayanth kaweeshwar

Drama

వచన కవితా గీతం

వచన కవితా గీతం

2 mins
462


వచన కవితా గీతం అంశం : మహిళల కు - ఎందుకు లేవు ?


పురుష దేవతలు బాలురుగా ఉన్నప్పుడు ఉన్న లాలి పాటలు


స్త్రీ దేవతలు బాలికలు గా ఉన్నప్పుడు ఉన్న లాలి పాటలు


వారికెందుకు కెక్కువ లేవు?


చలాకీ తనంతో ఆకట్టుకున్న ఆట పాటలలో బాలురకు చొచ్చుకు పోయే

స్వాతంత్య్రం లలనల కెందుకు తగ్గిపోయింది ? రాజ్యాలను ఏలిన పురుషులు

రాజులను ఆదర్శంగా తీసుకుంటున్నప్పుడు

మహిళలు రాజ్యాలను ఏలిన రాణులను ఆదర్శం గా ఎందుకు తీసుకో లేక పోతున్నారు ?


నలభీమ పాకాలతో పురుషులు వంటలను రుచికరం గా చేస్తూ ఒక గుర్తింపు పొందితే

; వనితలు అలా ఎందుకు ఐకాన్ గా ఎందుకు ఉండలేక పోతున్నారు ?

పురుషుల అభివృద్ధి కి స్త్రీలు , స్త్రీల అభివృద్ధికి పురుషులు సహాయ

సహకారాలు అందిపుచ్చుకోవడం లో వ్యత్యాసం ఎందుకుంటుంది ?


సినీ తార అయ్యే మోజులో ఎవరిని పడితే వారిని నమ్మితే , తేనే పూసిన

కత్తుల్లాంటి మాటలలో పడతామెందుకు లే ?

ఒళ్ళు గుల్ల చేసుకొని అనారోగ్యం పాల్జేసుకోవడం ఎందుకు తల్లీ ?

అడుసు త్రొక్క నేలా – కాలు కడుగానేలా?


వృత్తి , ప్రవృత్తులను పెట్టుకో తల్లీ , ఒకటి లేకుంటే ఇంకోటి మన

జీవితాన్ని నడుపుతుంది.

ఇంట్లో పెద్దల సలహాలను , మార్గ నిర్దేశములను పాటించి నీ జీవితాన్ని

ఆరోగ్య కరమైన , ఆహ్లాద కరమైన ఆలోచనల తో నీ అభి వృద్ధికి బాటలను వేసుకో

తల్లీ . ఇతర నిస్సహాయులకు సహాయ సహకారాలను అందించి


వారికి తలలో నాలుక గా ఉంది వారి ఆశీర్వాదాలు తీసుకో తల్లీ .


ముగింపు : “ చెడు కనవద్దు , చెడు అనవద్దు , చెడు వినవద్దు మరియు చెడు

చేయవద్దు ఇది బాపూజీ పిలుపు , అదే మేలుకొలుపు”


వ్యసనాల బారిన పడే , పడిన , పడబోతున్న యువతకు , పెడత్రోవన

ఎగదోసే దుర్మార్గుల నుండి ఆమడ దూరం గా ఉండండి , తస్మాత్ జాగ్రత్త !


ఈ ప్రబోధాత్మక వచన గీతాన్ని చదివి , పాడి , ఆచరించి , సన్మార్గంలో

పయనించి యువతరానికి మార్గ దర్శకులు గా మారండి . మొన్నటి తరం, నిన్నటి

తరం, నేటి తరం , రేపటి తరం తర తరాల కు సరిపడా మొదటి అడుగు వేసి , మార్గ

దర్శకులు గా మారండి . అదృష్ట వంతులు, ఆదర్శ వంతులు , ఆరోగ్య వంతులు గా

మారే యువతకు ఆశీస్సులు , అభివాదములు .

కవీశ్వర్


Rate this content
Log in

More telugu poem from jayanth kaweeshwar

Similar telugu poem from Drama