ఆఖరి మజలీ
ఆఖరి మజలీ
ప౹౹
ప్రయాణంలో తప్పదుగా మనకూ మజలీ
జీవన యానంలో తెలియదులే ఆ మజలీ |2|
చ౹౹
ఇల్లు లాంటిదే ఈ దేహం తెలుసా జీవుడా
చెల్లుబాటున్నంతవరకూ చేరి ఉండేవాడా ౹2౹
మాయ కమ్మిన లోకంలో మర్మం కానలేవు
లోయలా లోతైనా జీవితం తెలసికొనలేవు ౹ప౹
చ౹౹
వచ్చినపుడు ఈ లోకంలోకి వట్టి చేతులేగ
పోయేటపుడు పట్టుకుపోయేది సున్నాలేగ ౹2౹
ఎందుకో ఏదో సంపాయించాలని ఆరాటం
అందుకే పగలూ రేయి తెలియని పోరాటం ౹ప౹
చ౹౹
అసలయిన సంచయం పెంచుకొని నిలువు
మసలి మంచితనంతో మనసులూ గెలువు ౹2౹
తొలకరి తొలగి ముదిమితో దేహమనే ఇల్లు
ఆఖరి ఇల్లు వదలు చెప్పి ఈ ఊపిరికి చెల్లు ౹ప౹