ఒక కోరిక
ఒక కోరిక


చుక్కల్ని తెచ్చి సిగలో తురిమేయగలడు
ముత్యాలు సిగ్గుపడేలా ఆమెను నవ్విస్తాడు
ఆకాశానికి నిచ్చెన వేస్తాడు
సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు చేరగలడు
కానీ ఆమె అడిగింది
ఒకే ఒక కోరిక
అది అతను చెయ్యలేడు
ఎప్పటికీ చెయ్యలేడు
అందుకే అతను తన శ్వాసను వదిలివేశాడు
ఆమెను వదులుకోలేక
ఆమె కోసం
అతను తన శ్వాసను వదులుకున్నాడు
ఆమె అడిగిన కోరిక ఆమెను వదులుకోవడమే