కోపం
కోపం

1 min

411
దాచుకోలేనంత బరువైనది
ఆపలేనంత అసాధ్యమైనది
ఆలోచనల్ని చంపేసి ఆవేశాన్నిచ్చే ఆయుధం లాంటిది
నిప్పు కనికల మాదిరి ఎర్రగా మండుతుంది
కారుమబ్బు కమ్మేలా దేహం దారి తప్పుతుంది
కణం కణం కసితో కాలిపోతుంది
నరం నరం నెత్తురుతో ఉడికిపోతుంది
ఊపిరి సెగ పొగలా కమ్ముకుంటుంది
గుండె చప్పుడు పిడుగు ధ్వనిలా ప్రజ్వలిస్తుంది
ప్రాణం తీసేంత ప్రమాదకరమైనది
దానితో ఆడుకోవడం అంత మంచిది కాదు...