నిన్ను కోరి
నిన్ను కోరి


చీకట్లో చంద్రబింబంలా నువ్వు కనిపించావు ఆ రాత్రి
ఆ క్షణం నీ గురించి ఆలోచించేలా చేసింది నన్ను
నీతో మాట్లాడాలని అనిపించింది ఆ నిమిషం
నా జీవితానికి దగ్గరగా వచ్చిన సిరివెన్నెలవి నీవే
బడికెళ్తున్న బాటలో గుడినుంచి వచ్చిన దేవతలా నా ముందు నిలిచావు
వర్షంలో తడుస్తూ వెళ్తున్న నాకు నీ గొడుగులో చోటిచ్చావు
నిలిచావు ఆ క్షణం నా మొదటి స్నేహితురాలిగా
ఎప్పటికీ నాతో ఉంటావని ఆశతోనే బ్రతికా ఇప్పటివరకూ
మెరుపులా తళుక్కుమని మెరిసిపోయావు నా జీవితపు ఆకాశంలో
నీ కోసం ఎదురుచూస్తున్న నాకు మళ్ళీ కనిపించావు మూడేళ్ల తర్వాత
దగ్గరయ్యావు విడిపోనంతగా
అప్పుడే అనుకున్నాను ఇక నువ్వు నా సొంతం అని
అలా అనుకోవడమే నేను చేసిన తప్పుగా నువు భావించి నను దూరం చేసావు
అయినా సరే,
ఆ ఆకాశంలోకి నక్షత్రం రాక తప్పదు
నా జీవితంలోకి నీ రాక తప్పదు
అనే చిన్ని ఆశతో నీకోసమే వేచిచూస్తా ఎప్పటివరకైనా