మౌన వేదన.. !
మౌన వేదన.. !
ప్రతి రోజూ...
ప్రతి క్షణం...
నా మనసుతో నాకు,
నా ఆలోచనలతో నాకు,
నా భావాలతో నాకు,
మౌన యుద్ధం జరుగుతూనే ఉంది..
నా పెదాలు పలుకలేని భావాలు ఎన్నో..
నా కళ్ళు పలుకుతున్నాయి.
నా మనసుసులో దాచలేని భావాలెన్నో..
నా కలంలో జాలువారుతున్నాయి.
అయినా నాలో నాకే సంఘర్షణ..
నా ఎదను మీటి నా మౌనాన్ని ఛేదించి
నాతో రాగాలు పలికించే హృదయం కోసం..
నా మనసు గెలిచి తనతో జత కట్టే
మరొక మనసు కోసం...
నా భావాలను భావి తరాలకు పరిచయం చేసే
నా కలం...నేస్తం కోసం..
ప్రతి రోజూ నా గుండె గూటిని తెరిచి ఉంచినా..
నీ అడుగుల జాడ కానరాక...
నా చెక్కిళ్ళ పైన జారుతున్న
కన్నీటితో నా ఊహలకి మళ్ళీ ప్రాణం పోస్తున్నాను.
అసలు ఉన్నావో , లేవో..
వస్తావో, రావో....తెలియని..
నీ... కోసం..
తపించి - పరితపించి,
అలసిన నా మనసుని ఎలా సేద తీర్చాలి.
బరువెక్కిన హృదయాన్ని ఎలా ఓదార్చాలి,
మూగ బోయిన నా గొంతుతో ఏ రాగం పలికించాలి.
ఇలా ఎంత కాలం నాలో నాకే
ఈ మౌన వేదన..
నీపై నాలో ఈ మూగ ప్రేమ... !
శ్రీ....
హృదయ స్పందన...