STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Tragedy Others

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Tragedy Others

నేనొక ఎమోషనల్ ఫెలోని!!

నేనొక ఎమోషనల్ ఫెలోని!!

1 min
299

నేనొక ఎమోషనల్ ఫెలోని!!


కనుపాపచుట్టూ చేరిన నీరుతో చూపు మసకబారింది 

కానీ తన రూపం మాత్రమే స్పష్టంగా కనిపిస్తూ.. కంటి చెమ్మ చెంపలమీదికి జారెందుకు ప్రయత్నిస్తుంది.

అయినా నేనెప్పుడో కన్నీటితో ఒప్పందం చేసుకున్నా!!

అందుకే జారని కన్నీళ్లు మదిలో చేరి సంద్రాన్ని తలపిస్తుంటే...

కన్నీటిని బయటకు జారనిస్తే భారం తగ్గుతుందేమో..కానీ..

కన్నీళ్లుగా తను నాలోంచి బయటకు వెళ్ళిపోతే...

నేను సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతాను!!

జారవిడవని కన్నీళ్లు గుండెల్లో చేరి హృదయాన్ని ఎప్పుడు తడిచేస్తున్నాయి కాబట్టే... ఇంకా నాలో తనమీద ప్రేమ రోజు కొత్త ఊపిరి పోసుకుంటుంది.

తడిఆరిన హృదయాల్లో ప్రేమ ఉంటుందా?


అందుకే నేనొక ఎమోషనల్ ఫూల్ ని..

తన ప్రేమ కోసం... ప్రేమగా...

శ్రీలత. కె

హృదయస్పందన 



Rate this content
Log in

Similar telugu poem from Tragedy